సాయిప‌ల్ల‌వి డ్యాన్స్ పై ఫిదా అయిన మ‌హేశ్

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 26, 2021, 01:42 PM

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య – ఫిదా ఫేం సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా… శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి పవన్ సీహెచ్ స్వ‌ర‌క‌ల్ప‌న చేశారు. ఇంటెన్సివ్ ప్రేమ క‌థ చిత్రంగా ల‌వ్ స్టోరీ తెర‌కెక్కింది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆశించిన స్థాయిలోనే ఆక‌ట్టుకుంటోంది. 


ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్‌లూక్‌, టీజ‌ర్‌, సాంగ్స్‌పై ప‌లువురు సెల‌బ్రిటీలు స్పందించ‌డం కూడా ఈ మూవీకి ఫ్ల‌స్ పాయింటే. దీంతో ఈ సినిమా విడుద‌ల‌కు ముందే మంచి టాక్ ద‌క్కించుకుంది. కొంద‌రు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ ఫీలింగ్‌ను పంచుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు తాజాగా లవ్ స్టోరీ సినిమాను చూశారు.


ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు లవ్ స్టోరీ సినిమా గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారంటూ శేఖ‌ర్ క‌మ్ముల‌ను పొగిడేశారు. నాగ‌చైత‌న్య న‌ట‌న అద్భుతమ‌నీ, ఈ చిత్రం ఆయ‌న కెరీర్‌ను మ‌లుపుతిప్పే సినిమా అవుతుంద‌ని అన్నారు. ఇక సాయి ప‌ల్ల‌వి గురించి ప్రస్తావిస్తూ..


సాయిప‌ల్ల‌వి ఎప్పటిలాగే త‌న డ్యాన్స్ తో చేసింద‌న్నారు. అస‌లు ఆ అమ్మాయి శ‌రీరంలో ఎముక‌లు ఉన్నాయా.? అంటూ సాయి ప‌ల్ల‌విపై ప్ర‌శంసించారు. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి చేసిన డ్యాన్స్ వెండితెర‌పై మునుపెన్న‌డూ చూడ‌లేద‌ని ట్వీట్ చేశారు.


ఈ సినిమా నాగ చైత‌న్య‌, శేఖ‌ర్ క‌మ్ముల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలువ‌నున్న‌ది. విడుద‌లైన తొలిరోజే..


కొత్త రికార్డులను క్రియేట్ చేసేది. భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించిన లవ్ స్టోరీ మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మ‌రోవైపు.. మహేష్ బాబు షేర్ చేసిన పోస్ట్ కు 11,700కు పైగా లైక్స్ వచ్చాయి.
Recent Post