కూకట్‌పల్లిలో సందడి చేసిన కృతి శెట్టి!

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 26, 2021, 03:21 PM

ప్రముఖ వస్త్ర షోరూం జె.సి. బ్రదర్స్‌లో సినినటి కృతిశెట్టి సందడి చేశారు. కూకట్‌పల్లిలో ఈ షోరం ప్రారంభోత్సవానికి వచ్చిన కృతిశెట్టి మాట్లాడుతూ.. జె.సి.బ్రదర్స్‌ షోరూంను అద్భుతంగా తీర్చిదిద్దారని, వస్త్రాల కలెక్షన్‌ చాలా ట్రెండీగా ఉందని చెప్పారు. రానున్న పండుగ సీజన్‌కి ఇది ఒక ట్రెండీ షాపింగ్‌ డెస్టినేషన్‌ అవుతందని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్లు మర్రి జనార్దన్‌రెడ్డి, మర్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా జంటనగర ప్రజలకు మార్కెట్‌లో అందరి కన్నా తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. కస్టమర్లకు మరింత సౌకర్యంగా సేవలందించాలనే ఉద్దేశంతోనే కూకట్‌పల్లిలో ఉన్న తమ బ్రాంచిని అత్యాధునిక వసతులకో ఇంత పెద్ద ప్రాంగణంలోకి మార్చామని వెల్లడించారు.


ఇక కృతిశెట్టి విషయానికొస్తే.. . చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా పలు యాడ్స్ తో ఓ మోస్తారు గుర్తింపు పొందింది ఈ కన్నడ బ్యూటీ `ఉప్పెన` చిత్రంలో హీరోయిన్‌గా మారిపోయింది. ఒకే ఒక్క మూవీతో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో ఒకరుగా కృతిశెట్టి స్థానం సంపాదించింది. ప్రస్తుతం కృతి నానితో `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్‌ పోతినేనితో లింగుస్వామి చిత్రంలో నటిస్తుంది. అలాగే నితిన్‌తో 'మాచర్ల నియోజకవర్గం'చిత్రంలోనూ ఆమే హీరోయిన్‌ గా చేస్తుంది.
Recent Post