మరోసారి బ‌న్నీ, బోయ‌పాటిల మాస్‌ కాంబినేష‌న్‌!

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 14, 2021, 12:28 PM

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా లో హీరోగా నటిస్తున్నాడు. పాన్ ఇండియా యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో రెండు పార్టులుగా  రాబోతున్న ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అయితే అల్లుఅర్జున్  కొత్త సినిమా వార్త ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. బ‌న్నీ, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో సినిమా రాబోతున్న‌ర‌ట‌. బోయపాటి చెప్పిన కథని బ‌న్నీ ఓకే చేశారని, ‘పుష్ప’ తర్వాత ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే నిర్మించబోతున్నామని తెలిపారు. 2016లో బోయ‌పాటి, అల్లు అర్జున్ కాంబినేష‌న్లో వ‌చ్చిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్ స‌రైనోడు బాక్స్ ఆఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. 
Recent Post