ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటున్న 'మంచిరోజులొచ్చాయి' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 14, 2021, 12:31 PM



టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభ‌న్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘మంచి రోజులొచ్చాయి’. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. మై వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్‌.. నా పేరు సంతోష్..ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ వీడు అనేది నా ట్యాగ్‌లైన్..అంటూ సంతోష్ శోభ‌న్ త‌నను తాను ప‌రిచ‌యం చేసే సన్నివేశంతో ట్రైల‌ర్ మొద‌లైంది.


నా కూతురు లాంటి కూతురిని క‌న్న ఎవ‌రైనా స‌రే ఆరోగ్యంగా ఉండాల్సిందే..అంటూ అశిష్ ఘోష్ త‌న కూతురు గురించి చెప్పే సంభాష‌ణలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. రియ‌ల్ లైఫ్ రోల్స్ ను స్పూర్తిగా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఎస్‌కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడు. మారుతి త‌న‌దైన మార్క్ కామెడీ ట‌చ్‌తో వినోదాన్మి అంచించ‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్తో అర్థ‌మ‌వుతుంది.


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com