సింగరేణి గనుల నేపథ్యంలో నాని కొత్త సినిమా

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 14, 2021, 12:44 PM

నాని హీరోగా నటించిన సినిమా 'టక్ జగదీష్' ఓటీటీలో విడుదలైంది.ఆ తరువాత 'శ్యామ్ సింగ రాయ్'  సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.ఆ వెంటనే తన 29వ సినిమాగా ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ రేపు మధ్యాహ్నం ఉంటుందని ముందుగానే చెప్పారు. శ్రీకాంత్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడనీ, సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి, రేపు మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది.  
Recent Post