రాత్రి గెలిచాం.. ఉదయం ఓడిపోయాం : నటి హేమ

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 14, 2021, 12:55 PM

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తాము రాత్రి గెలిచాం.. ఉదయం ఓడిపోయాం అని నటి హేమ అన్నారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే నటి హేమ గురువారం విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మా ఎన్నికలలో తాము రాత్రి గెలిచాం.. ఉదయం ఓడిపోయాం. ఏం జరిగిందో ఆ అమ్మ వారికే తెలియాలి అని అన్నారు.


 


 
Recent Post