మరో బయోపిక్ లో శ్రీదేవి కూతురు

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 14, 2021, 02:16 PM

శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత రెండు సినిమాలు పర్లేదనిపించినా ‘గుంజన్ సక్సేనా’ సినిమాతో తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనా బయోపిక్ ఇది. ఇందులో అద్భుతంగా నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంశలు అందుకుంది. ఈ సినిమాతో జాన్వీ స్టార్ హీరోయిన్ అయింది. తాజాగా మరో బయోపిక్ లో నటించాలని ఉందని తెలిపింది.ఇటీవల ఢిల్లోలో టోక్యో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన జరిపిన పారాలింపియన్స్ సన్మాన కార్యక్రమానికి జాన్వీ అతిధిగా హాజరయ్యింది. అక్కడ చాలా మంది పారాలింపియన్స్ తో మాట్లాడింది. ఆ వేదికపై మాట్లాడుతూ… తాను అరుణిమ సిన్హా కథని బయోపిక్ చేయాలి అనుకుంటున్నాను. ఆమె జీవిత చరిత్రని తెరపై చూపించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపింది. నేను అరుణిమ సిన్హాను కలిశాను. తన కథ చాలా స్ఫూర్తిదాయకం. ఆమె కథలో నటించడానికి ఇష్టపడతాను అని ప్రకటించింది. అరుణిమ సిన్హా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వికలాంగురాలు. ఈమె క్రీడాకారిణి, పర్వతారోహకురాలు కూడా. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇప్పటికే ఒక బయోపిక్ లో అదరగొట్టిన జాన్వీ ఈ బయోపిక్ కనుక తీస్తే తనకి మంచి పేరుతో పాటు అవార్డులు కూడా ఖాయం అంటుంది బాలీవుడ్.
Recent Post