బాలకృష్ణను కలసిన మోహన్‌బాబు

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 14, 2021, 02:21 PM

గత సార్వత్రిక ఎన్నికల్లో లోకేశ్‌ ఓటమికి ప్రచారం చేసినప్పటికీ.. బాలకృష్ణ అవేమీ మనసులో పెట్టుకోకుండా మంచి మనసున్న వ్యక్తిలా వ్యవహరించారని సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో బాలయ్య తన తనయుడు విష్ణుకి మద్దతుగా ఉండి.. గెలిపించడం పట్ల మోహన్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన విష్ణుతో కలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్లి.. భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అలాగే, 16వ తేదీన జరగనున్న ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకార కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని బాలయ్యని వారు కోరారు.


భేటీ అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన్ని కలవడం ఆనందంగా ఉంది. అన్నయ్య యన్‌.టి.రామారావు గారే నన్ను బాలయ్య ఇంటికి పంపించినట్లు ఉంది. గత సాధారణ ఎన్నికల సమయంలో మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేశ్‌ ఓటమికి ప్రచారం చేశా. కానీ, ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ ఎన్నికల్లో విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విష్ణుకి ఓటు వేసి.. గెలిపించారు. ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా ఉంటానని చెప్పారు’’ అని తెలిపారు.


 


 


 
Recent Post