దగ్గుబాటి వెంకటేష్ , రానా ల కలయికలో ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈరోజు అక్టోబర్ 14 నుంచి షూటింగ్ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ హిందీ, తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ను ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘మీర్జాపూర్’ వంటి సూపర్ హిట్ సిరీస్లను రూపొందించిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేస్తున్నారు.