ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“బుజ్జీ.. ఇలారా” సినిమా టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 19, 2021, 05:01 PMరూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్ పి , జి . నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై “గరుడవేగ” అంజి దర్శకత్వంలో సునీల్ – ధన్ రాజ్ ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ ట్యాగ్ లైన్. తో తెరకెక్కిన “బుజ్జీ.. ఇలారా”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ధన్ రాజ్ సీఐ కేశవ్ నాయుడు, మహమ్మద్ ఖయ్యుమ్ అనే పోలీస్ గా సునీల్ నటించిన ఈ మూవీ లో చాందిని తమిళరసన్ , పోసాని కృష్ణమురళి , శ్రీకాంత్ అయ్యర్ , సత్యకృష్ణ , వేణు ముఖ్య పాత్రలలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.“బుజ్జీ.. ఇలారా”మూవీకి ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ “బుజ్జీ.. ఇలారా”మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com