వరంగల్‌లో కొండా సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చిత్ర యూనిట్ హోటల్‌ను ఖాళీ చేశారు. అయితే దీనిపై ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని ఆనాటి కార్ల్‌మార్క్స్ తెలుసుకున్నట్టే పిచ్చి పిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని తెలుసుకోవాలని ట్వీట్ చేశారు ఆర్జీవీ.