ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మతమే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 21, 2021, 12:27 PM



యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. రాజాగారు రాణివారు సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఇక ఇటీవల ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో మరో హిట్ ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం కిరణ్ హీరోగా నటిస్తున్న సినిమా సమ్మతమే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపినాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించారు. కాగా ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.


ఇక ఈ గ్లింప్స్ లో కిరణ్, చాందిని కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య మాటలు కొత్తదనం చూపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.



 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com