ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కేజిఎఫ్ : చాప్టర్ 2″ : శ్రీనిధి స్పెషల్ పోస్టర్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 21, 2021, 05:09 PM



దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో 'కేజిఎఫ్ 2' కూడా ఒకటి. 'కేజిఎఫ్ : చాప్టర్ 1' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందరి దృష్టి కన్నడ చిత్రసీమపై పడేలా చేసిన ఈ సినిమా రెండవ భాగం 'కేజిఎఫ్ 2' టైటిల్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. శాండల్ వుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. 'కేజిఎఫ్' మొదటి భాగంలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి రెండవ భాగంలో కూడా శ్రీనిధి శెట్టి యష్ తో మరోసారి రొమాన్స్ చేస్తోంది.


ఈరోజు శ్రీనిధి తన 28 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో 'కేజిఎఫ్ : చాప్టర్ 2″ మేకర్స్ శ్రీనిధి స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేసారు. ఈ యాక్షన్‌ ఎంటర్టైనర్ లో శ్రీనిధి రీనా దేశాయ్ పాత్రను పోషిస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. 'మా కిల్ లేడీ శ్రీనిధి శెట్టి లేదా రీనా దేశాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. కేజిఎఫ్ : చాప్టర్ 2లో రీనా ఏమి తీసుకువస్తుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ప్రేమ, క్రూరత్వం, వాట్ నాట్ ?' అంటూ ఆ పోస్టర్ ను షేర్ చేశారు. అందులో శ్రీనిధి శెట్టి బ్లాక్ కలర్ లంగావోణీని ధరించి, ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయింది. ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, సోను గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కిరగండూర్ తన బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com