బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా హౌస్‌లో ఎగ్స్ కోసం యుద్ధం జరుగుతోంది. తాజా ప్రోమోలో సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు చూపించారు. హౌస్మేట్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయ్యారు. బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో గెలుపొందడం కోసం జెస్సీ సిరి సాయం తీసుకున్నాడు. అయితే తనకు తెలియకుండా జెస్సీకి సిరి సాయం చేయడంతో షణ్ముఖ్ ఫీల్ అయ్యాడు. జెస్సీ, సిరిలతో కోపంగా మాట్లాడాడు. "ఇప్పటికే హౌస్ మేట్స్ అందరూ ‘టాస్క్ సరిగ్గా ఆడు’ అంటున్నారు. అందరూ నన్ను లైట్ తీసుకుంటున్నారు. జెస్సీ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు. నువ్వు సాయం చేశావు. చివరికి నేను ఇలా మోసపోయాను. నాకు గేమ్ ఆడటం కూడా రాదు అదే నా దరిద్రం’’ అంటూ షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు షణ్ముఖ్ మాటలతో సిరి, జెస్సీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. మంచి స్నేహితులుగా ఉన్న షణ్ముఖ్-సిరి-జెస్సీల మధ్య బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చిచ్చు పెట్టింది.