ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రజనీకాంత్ ఎంపిక

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 11:48 AM



 సినీ ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తలైవా రజనీకాంత్ ను వరించింది. 2019 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రజనీ ఎంపికయ్యారు. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు రజనీ. ఈ సందర్భంగా ఆయన చెన్నైలోని తన నివాసం దగ్గర మీడియాతో మాట్లాడారు. అవార్డు రావడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఇంత గొప్ప అవార్డు తనకొస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఇంత మంచి తరుణంలో తన గురువు కె. బాలచందర్ మన మధ్య లేకపోవడం బాధిస్తోందన్నారు.ఈ రోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని రజనీ అన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంటున్న రోజే తన కూతురు సౌందర్య ఎంతో ఇష్టపడి సిద్ధం చేసిన ‘హూట్ యాప్’ను విడుదల చేస్తున్నానని తెలిపారు.వాస్తవానికి రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గత ఏప్రిల్ లోనే కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అయితే కరోనా కారణంగా అవార్డుల ప్రదానం వాయిదా పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com