ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“F 3” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 12:16 PM



శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కాంబినేషన్ లో “F 3” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , దసరా స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శివరాత్రి ఫిబ్రవరి 25 వ తేదీ  పర్వదినం సందర్భంగా “F 3” మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించినట్టుగానే “F 3” మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com