ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బన్నీతో బోయపాటి సినిమాకి స్టోరీ రెడీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 01:30 PM



బోయపాటి సినిమాకి భారీతనం ప్రధమ లక్షణంగా కనిపిస్తుంది.అయితే బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'అఖండ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ కథానాయకుడిగా ఈ సినిమా నిర్మితమైంది.ఈ సినిమా తరువాత ఆయన బన్నీతో చేయనున్నట్టు ఒక వార్త బలంగా వినిపిస్తోంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' వేదికపై బన్నీవాసు .. 'అన్ స్టాపబుల్' వేదికపై అల్లు అరవింద్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది మాత్రం చెప్పలేదు.అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను బోయపాటి పూర్తి చేసినట్టుగా చెబుతున్నారు. ఇది యాక్షన్ తో కూడిన కామెడీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ప్రస్తుతానికి వేణు శ్రీరామ్ - 'ఐకాన్' ప్రస్తావన ఎక్కడా లేదు. అందువలన బోయపాటితో బన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాడనే విషయంలో క్లారిటీ వచ్చిందనే అనుకోవాలి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'సరైనోడు' వంటి హిట్ వచ్చిన సంగతి తెలిసిందే.   


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com