ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"హీరో " సినిమా సాంగ్ రిలీజ్ చేసిన రానా

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 03:06 PM



ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు… గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ' హీరో '. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా… హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల మహేష్ బాబు చేతుల మీదుగా  ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లను విడుదల చేయగా వాటిని మంచి స్పందన లభిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్ర బృందం ప్రేక్షకులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది.హీరో సినిమా నుంచి ' అచ్చ తెలుగందమే ' అనే పాటను హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ఈ పాటకు జిబ్రాన్ సంగీతంగా అందించగా సిధ్ శ్రీరామ్ మరోసారి తన గాత్రంతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. ' నింగిలో తారక నేలపై వాలెనే… కన్నుల పండగై కాలమే ఆగెనే ' అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో అశోక్, నిధి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని చెప్పాలి. ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న మూడోతరం హీరో కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com