అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'ది ఘోస్ట్' సినిమాలో హీరోయిన్ మారింది. గతంలో నాగ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా ఆమె స్థానంలో అమలాపాల్‌ను తీసుకుంది. దీంతో నాగ్ సరసన కాజల్‌ను చూడాలన్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. అయితే దీనికి కారణం కాజల్ అనే చెప్పాలి. ఇప్పటికే నాగార్జున, కాజల్ మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కాజల్ గర్భవతి కావడంతో సినిమా షూటింగ్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో సినిమా మేకర్స్ కాజల్ స్థానంలో మరో హీరోయిన్ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' మూవీ తెరకెక్కుతోంది. తాజాగా హీరోయిన్ మార్పుతో కాజల్‌తో తీసిన సన్నివేశాలను అమలాపాల్‌తో రీషూట్ చేయనున్నారు. అమలాపాల్ ఈ మూవీలో నాగ్‌తో రొమాన్స్ మాత్రమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లోనూ కనిపించనుంది. ఈ చిత్రంలో హీరో రా ఏజెంట్ పాత్రలో కనిపించనుండగా.. హీరోయిన్ అతడికి సహాయరాలి పాత్రలో కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో హిందీ నటి గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించనున్నారు.