'ఎటర్నెల్స్' లో ఏంజెలీనా జోలీ కీలకపాత్ర!

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 25, 2021, 05:13 PM

డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూపర్ హీరో మూవీ 'ఎటర్నెల్స్' దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది. ఎవెంజర్స్ సిరీస్ ఎండ్ అవ్వడంతో హాలీవుడ్ మూవీ లవర్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి మార్వెల్ వారు 'ఎటర్నెల్స్' అనే కొత్త సూపర్ హీరోల్ని సృష్టించారు. భారతదేశంలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. థేనా అనే సూపర్ వుమెన్ గెటెప్ లో ఏంజెలీనా తన ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయబోతున్నారు. 'ఎవెంజర్స్' కి మించిన పవర్స్ తో 'ఎటర్నెల్స్' లో సూపర్ హీరోలు అద్భుతమైన విన్యాసాలు చేయనున్నారు. అలానే ఈ సినిమాలో ఇండియన్ వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయని, అవి భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని డిస్నీ ఇండియా బృందం తెలిపింది. 
Recent Post