ప్రియమణితో బోల్డ్ వెబ్ సీరీస్ ప్లాన్ !

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 25, 2021, 05:26 PM

హీరోయిన్ గా నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న ప్రియమణి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా సరే స్టార్ క్రేజ్ దక్కించుకోవడంలో విఫలమైంది. ఇక సినిమా ఛాన్సులు కూడా తగ్గడంతో మ్యారేజ్ చేసుకున్న ప్రియమణి ఆఫ్టర్ మ్యారేజ్ మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. స్మాల్ స్క్రీన్ షోస్ లో జడ్జ్ గా వ్యవహరిస్తున్న ప్రియమణి ఆ క్రేజ్ తో కూడా సినిమా అవకాశాలు కొట్టేస్తుంది.


ఈమధ్య వచ్చిన నారప్పలో నటించిన ప్రియమణి రానా, సాయి పల్లవి నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. వీటితో పాటుగా మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది. ఓ పక్క సినిమాలతో పాటుగా ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ లో కూడా ఆమె నటిస్తుంది. అమేజాన్ ప్రైం లో సూపర్ హిట్ వెబ్ సీరీస్ లో ఒకటైన ఫ్యామిలీ మెన్ లో ప్రియమణి నటించింది. వెబ్ సీరీస్ లతో ఆమె క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు.అందుకే ఇప్పుడు ఆమెతో ఒక బోల్డ్ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ టైటిల్ హోమ్లీ ఆంటీ అని పెట్టారు. టైటిల్ లోనే వెబ్ సీరీస్ ఎలా ఉండబోతుందో చెప్పేసారు. మరి హోమ్లీ ఆంటీగా ప్రియమణి ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.


 


 
Recent Post