ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'రొమాంటిక్' మూవీ నుంచి న్యూ ట్రైలర్!

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 25, 2021, 07:10 PM

ఆకాశ్ పూరి - కేతిక శర్మ జంటగా రూపొందిన 'రొమాంటిక్' .. ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన ప్రతి అప్ డేట్ కూడా టైటిల్ కి తగినట్టుగా రొమాన్స్ పాళ్లతో ఆకట్టుకుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను వదిలారు. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్  కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.


ఆకాశ్ పూరి పాత్ర పైనే పూర్తి ఫోకస్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఇది. కొన్ని విజువల్స్ 'పోకిరి' సినిమాను గుర్తుకుచేస్తాయి. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తోంది. ఈ పాత్ర చేయడానికి రమ్యకృష్ణ అంగీకరించిన దగ్గర నుంచి ఈ సినిమా జాతకమే మారిపోయిందని పూరి చెప్పడం వలన, అందరిలో మరింత ఆసక్తి పెరిగింది. ప్రేమకీ .. మోహానికి మధ్యగల తేడా చుట్టూ అల్లుకున్న రొమాంటిక్ మూవీ ఇది.
Recent Post