వారి పై చర్యలు తీసుకొoడి.. కోర్టును మరోసారి కోరిన సమంత

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 25, 2021, 07:36 PM

అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తనపై మూడు యూట్యూబ్ ఛానెల్స్ అసత్య ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగేలా చేశాయంటూ కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే సమంత దాఖలు చేసిన పిటిషన్‌పై మరోసారి వాదనలు వినిపించాలని కోర్టు తెలపడంతో సోమవారం మరోసారి సమంత పిటిషన్‌పై విచారణ చేపట్టారు. సమంత తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి పై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం సరైంది కాదని కోర్టుకు విన్నవించారు. అలాగే సమంత ప్రతిష్టను దెబ్బతీసే మూడు యూట్యూబ్ ఛానెల్స్‌పై చర్యలు తీసుకొని, ఆ లింక్‌లు తొలిగించాలని కోరారు. సమంత తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు విన్న కూకట్ పల్లి కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
Recent Post