మహేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్...!

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 26, 2021, 08:14 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు గతంలో అధికారికంగా ప్రకటించారు. కానీ మధ్యలో దర్శకుడు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఇప్పుడు అంతా తారుమారు అయ్యే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలైన తరువాత రెండు, మూడు వారాల పాటు సర్కారు వారి పాట సినిమాకు సరైనా థియేటర్లు దొరక్కపోవచ్చని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద కూడా పడే అవకాశం ఉండడంతో ‘సర్కారు వారి పాట’ నిర్మాతలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట విడుదలను వాయిదా వేస్తేనే బెటర్ అని భావిస్తున్నారట. అందులో భాగంగా ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.
Recent Post