అక్టోబర్ 28న ”సామి సామి” ఫుల్ సాంగ్...!

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 26, 2021, 08:17 AM

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి సాంగులు విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక తాజాగా మూడో సింగిల్ ” సామి సామి ” ప్రోమోను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఈ ప్రోమో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి పూర్తి సాంగ్‌ను అక్టోబర్ 28న ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తామని పుష్ప చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా మోనిక యాదవ్ పాడారు.
Recent Post