బాలయ్య “అఖండ”నుంచి ఆ అప్డేట్ ఎప్పుడో ?

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 26, 2021, 08:40 AM

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ చిత్రం “అఖండ”. మాస్ ఆడియెన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ ఈ ఏడాది దీపావళి కానుకగా వస్తుందని టాక్ గత కొన్ని రోజులు నుంచి వినిపిస్తుండగా ఇప్పుడు దానిపై క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఈ పండక్కి ఆ పండక్కిఆ ని టాక్ వస్తున్నా మేకర్స్ మాత్రం ఇంకా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు అని తెలుస్తుంది. అలా ఈ వచ్చే నవంబర్ దీపావళి కానుకగా అఖండ గర్జన ఉంటుంది అని బజ్ వినిపించింది కానీ లేటెస్ట్ గా మాత్రం ఈ సినిమా డిసెంబర్ నెలకి షిఫ్ట్ అయ్యుపోయినట్టుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.


Recent Post