ఆసక్తికర పోస్ట్‌ చేసిన ప్రియమణి

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 28, 2021, 10:21 AM

2003లో వచ్చిన 'ఎవరే అతగాడు' సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార ప్రియమణి. అనంతరం పలు చిత్రాల్లో నటించిన ఈ ట్యాలెండెట్‌ యాక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'యమదొంగ' సినిమాతో ఒక్కసారిగా టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరారు. తర్వాత పలు వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోయారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకున్న ప్రియమణి.. వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే వరుస ఆఫర్లను దక్కించుకుంటూ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పలు టీవీ షోలలో అతిధిగా వ్యవహరిస్తూ బుల్ల తెర ప్రేక్షకులకు సైతం చేరువయ్యారు ప్రియమణి.


ఇక కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు ప్రియమణి. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ఫోట్‌ షూట్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రింటెడ్‌ గౌన్‌లో ట్రెండీ లుక్‌లో కనిపించిన ప్రియమణి ఈ ఫోటోల్లో అందానికే అసూయ పుట్టేలా కనిపించారు. ఇక ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ జోడించారు.


ప్రియమణి పోస్ట్‌ చేసిన క్యాప్షన్‌ ఏంటంటే.. 'జీవితం చాలా త్వరగా గడుస్తోంది. కాబట్టి వీలైనంత నవ్వండి, కొత్త పనులు నేర్చుకోండి, మనుషులను క్షమించేయండి, పగను వీడండి, గతాన్ని మరిచిపోండి, ఎప్పుడూ సంతోషంగా ఉండండి' అంటూ మోటివేషనల్‌ కామెంట్‌ చేశారు ప్రియమణి.  
Recent Post