ఘనంగా హీరో కార్తికేయ రిసెప్షన్ వేడుక

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 25, 2021, 02:53 PM

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో కార్తికేయ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు.తను ప్రేమించిన లోహిత మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు.నగరంలోని ఓ కళ్యాణ వేదికలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, తణికెళ్ల భరణి, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌ పుత్‌ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.


గత రాత్రి రిసెప్షన్ వేడుక జరుపుకోగా, ఇండస్ట్రీకి సంబంధించి ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, ఆది సాయికుమార్, రాహుల్ రవీంద్రన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తుంది. వరంగల్ నీట్‌ లో బీటెక్‌ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసిందట. ఇప్పుడు తాను మంచి పొజీషన్‌లో ఉన్న నేపథ్యంలో పెళ్లి చేసుకున్నాడు. కార్తికేయ.. ప్రేమతో మీ కార్తిక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అది వర్కౌట్ కాలేదు. కానీ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్‌ ఎక్స్‌ 100’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.


తన వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడం మీద కార్తికేయ రీసెంట్‌గా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నేను పెద్దయ్యాక హీరో నవ్వుతా నా పెళ్ళికి చిరంజీవి వస్తాడు, అని చిన్నప్పుడు అమాయకంగా చెప్పేవాడిని. కానీ తన తల రాత అదే అయ్యి తన పెళ్ళికి చిరంజీవి గారు వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే చిరంజీవిని టాగ్ చేస్తూ మీరు నా పెళ్ళికి రావడం చాలా గొప్ప విషయం, ఇది నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే విషయం అని కార్తికేయ ఆనందం వ్యక్తం చేశాడు.


 
Recent Post