భీమ్లా నాయక్ కోసం త్రివిక్రమ్ భారీ రెమ్యూనరేషన్

  Written by : Suryaa Desk Updated: Sat, Nov 27, 2021, 11:54 PM

అల వైకుంఠపురం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సూపర్ ఫామ్ లో ఉన్నాడు త్రివిక్రమ్. తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాకు కూడా రైటర్ గా పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్‌తో పాటు హారిక & హాసిని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చాలా సన్నిహితుడు.త్రివిక్రమ్‌కి హోమ్ బ్యానర్‌లు కాబట్టి త్రివిక్రమ్‌తో రైటర్‌గా పని చేయడానికి భీమ్లా నాయక్ అంగీకరించాడు. అయితే త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేస్తున్నప్పటికీ భారీగానే పారితోషికం అందుకుంటున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం ఏకంగా 15 కోట్ల రూపాయల పారితోషికాన్ని త్రివిక్రమ్ అందుకుంటున్నాడు.ఈ సినిమా బిజినెస్‌లో 60 శాతం వాటా కూడా త్రివిక్రమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల బ్రాండ్ ఈ సినిమాకి భారీ బిజినెస్ చేస్తోంది.అందుకే దర్శకుడు సాగర్ చంద్ర కంటే త్రివిక్రమ్ కే ఎక్కువ పారితోషికం అందుతుంది. 
Recent Post