గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 28, 2021, 12:48 AM

శనివారం  బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ని స్వీకరించారు. ముంబయిలోని అందేరి వెస్ట్‌ చిత్రకూట్‌ స్టూడియోలో తన సినిమా 'యోధ' షూటింగ్ లో  చేస్తున్న సిద్ధార్థ్‌మల్హోత్రా ..సినిమా డైరెక్టర్లు సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఓజాతో కలిసి గ్రీన్‌ ఇండియా లో భాగంగా మొక్కలను నాటారు.  ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ మాట్లాడుతూ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా  సంతోషంగా ఉంది అని తెలిపారు . ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు . గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ద్వారా గ్లోబల్‌ వార్మింగ్‌ని అరికట్టి భవిష్యత్త్‌ తరాల మనుగడకు అవకాశం కల్పించవచ్చన్నారు. 
Recent Post