"రాధేశ్యామ్" మూవీ నుండి బిగ్ అప్డేట్ వచ్చేసింది..?

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 28, 2021, 11:38 AM

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం లో ప్రభాస్ మరియు పూజా హెగ్డే ప్రధాన జంటగా, ఎపిక్ డ్రామా 'రాధే శ్యామ్' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ మూవీ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాని యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వారికి మేకర్స్ ట్రీట్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి లవ్ ఆంథెమ్ ను రేపు విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఇందులో ప్రభాస్ అలాగే పూజా హెగ్డే రొమాంటిక్ యాంగిల్ లో మనకు కనిపించారు. ఈ సాంగ్ టీజర్ ను రేపు సాయంత్రం 7 గంటల సమయంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అలాగే హిందీ టీజర్ ను 1:00 గంటలకు చేస్తామని ప్రకటించింది.
Recent Post