దర్శకుడు శ్రీను వైట్ల ఇంట విషాదం

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 28, 2021, 01:14 PM

తెలుగు సినీ పరిశ్రమ కు చెందిన ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.  ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా కందుపాలెంలోనే అయన కన్నుమూశారు. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్లకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు.
శ్రీనువైట్ల ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ఢీ చిత్రం సీక్వెల్…‘ఢీ అంటే ఢీ’ని తెరకెక్కిస్తున్నారు. 2011లో దూకుడు, 2013లో బాద్షా వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన శ్రీను వైట్ల…ఆ తరువాత ఆ స్థాయి హిట్ అందుకోలేదు. చివరగా మూడేళ్ల క్రితం రవితేజతో `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ` చిత్రాన్ని రూపొందించిన శ్రీను వైట్ల…ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఢీ అంటే ఢీ చిత్రం చేస్తున్నారు.
Recent Post