ఆరోగ్యం విషమించడంతో కిమ్స్ ఆసుపత్రిలో చేరిన 'సిరివెన్నెల సీతారామశాస్త్రి'

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 28, 2021, 01:59 PM

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సిరివెన్నెల గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నాయి. సిరివెన్నెలను ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. సిరివెన్నెల క్షేమంగానే ఉన్నారని, కంగారు పడాల్సిన అవసరం లేదని సిరివెన్నెల తనయుడు యోగి తెలిపారు.
Recent Post