ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీడియాకు క్షమాపణలు చెప్పిన రాజమౌళి

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 28, 2021, 03:29 PM



ప్రస్తుతం ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో అన్ని భాషల్లో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో సహ అనేక బాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. జక్కన్న దగ్గరుండి మరీ ఈ ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. ప్రతి ఈవెంట్ లో అన్ని తానై చూసుకుంటున్నాడు. ఇంకా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పేరు తమిళ నాటా మార్మోగింది. శంకర్ కి ధీటైన దర్శకుడిగా సత్తా చాటిన రాజమౌళికి తమిళనాడులో ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన నుంచి వచ్చే ఏ సినిమాకి అయినా అక్కడ  క్యూరియాసిటీ అంతే ఇదిగా ఉంటుంది. అందుకు తగ్గట్టే ఆర్.ఆర్.ఆర్ తమిళ హక్కుల కోసం లైకా సంస్థ భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకుందని సమాచారం.
అయితే రాజమౌళి- చిత్ర నిర్మాత డివివి దానయ్య - ఆర్.ఆర్.ఆర్ తమిళ వెర్షన్ ను సమర్పిస్తున్న బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు చెన్నైలో జరిగిన జనని తమిళ వెర్షన్ `ఉయిరే` లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. గత 3 సంవత్సరాలుగా తమతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు మొదట క్షమాపణలు చెప్పారు. జనవరిలో సినిమా విడుదలకు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ లో తప్పకుండా వారితో సంభాషిస్తానని రాజమౌళి హామీ ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' పాన్ ఇండియా కేటగిరీలో పలు భాషల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ పీరియడ్ మల్టీ స్టారర్ యాక్షన్ డ్రామా జనవరి 7న విడుదలవుతోంది. ఇప్పటికే ప్రచారంలో వేగం పెంచిoది రాజమౌళి టీమ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com