నాగ శౌర్య ‘లక్ష్య’ ట్రైలర్ కు డేట్ ఫిక్స్

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 28, 2021, 04:00 PM

యంగ్ హీరో నాగ శౌర్య సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా గా వస్తున్నా మూవీ ‘లక్ష్య’. ఈ మూవీ డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ తో పాటు ఇతర అప్డేట్స్ సినిమాపై బజ్ పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేసారు. ‘లక్ష్య’ థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 1న విడుదల కానుంది. విలువిద్య ఆధారంగా తెరకెక్కుతున్న భారతదేశపు మొదటి చిత్రం ‘లక్ష్యం’. ఇందులో నాగ శౌర్య పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఆయన రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. కేతిక శర్మ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. నాగ శౌర్య ఇటీవల “వరుడు కావలెను” అనే సినిమాతో విజయం సాధించారు. ఇక ఈ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
Recent Post