మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ఆచార్య . ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'సిద్ధ' పాత్రలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. సిద్ధ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయాడు. టీజర్లో రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య ప్రేమను చూపించారు. ఇంతేకాకుండా ఈ టీజర్లో అనేక విషయాలు పొందుపరిచారు. 'ధర్మస్థలికి ఆపద వస్తే, అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుతుంది' అని రామ్‌చరణ్ మాస్‌గా డైలాగ్ చెప్పారు.
ఆచార్య నుంచి ఇదీవరకు వచ్చిన టీజర్, సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా విడుదల చేసిన సిద్ధ పాత్రకు సంబంధించిన ఈ టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుందని చూస్తే తెలుస్తోంది. మెగస్టార్ చిరంజీవి సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తుంది. ఈ చిత్రంలో ఆపద్బాందవుడు సోనూసూద్ కీలక పాత్ర పోషించారు. అలాగే ఇంతకుముందు రిలీజైన లాహే లాహే.. పాటలో సీనియర్ హీరోయిన్ సంగీత కనిపించిన సంగతి తెలిసిందే.