టాలీవుడ్ లో విషాదం..ప్రముఖ సీనియర్ డాన్స్ మాస్టర్ కన్నుమూత

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 28, 2021, 09:17 PM

టాలీవుడ్ లో  తీవ్ర విషాదం ప్రముఖ సీనియర్ డాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ మృతి చెందారు. ఈ మధ్య ఆయనకి కరోనా వచ్చింది దాంతో హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే మాస్టర్ పరిస్థితి విషమంగా ఉంది అని డాక్టర్లు తెలిపారు. హీరో ధనుష్, సోనూసూద్, మెగాస్టార్ చిరంజీవి వంటివారు శివశంకర్ మాస్టర్ చికిత్స కోసం సహాయం చేసారు. ఈరోజు  శివశంకర్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. అయితే శివశంకర్ మాస్టర్ పెద్ద కొడుకు కూడా కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.శివశంకర్ మాస్టర్ వయసు 72 సంవత్సరాలు. 1975 నుంచి ఆయన సినీ రంగంలో కొనసాగుతున్నారు. 10 భాషల్లో 800కి పైగా చిత్రాల్లో పాటలకు కొరియోగ్రఫీ అందించారు.
Recent Post