శివశంకర్ మాస్టర్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు : చిరంజీవి

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 28, 2021, 10:39 PM

టాలీవుడ్ లో విషాదం  ప్రముఖ సీనియర్ డాన్స్ మాస్టర్  శివశంకర్ కరోనా కారణంగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయానంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'ఖైదీ' సినిమాలో  ఆయనతో కలిసి పనిచేసాను అని చెప్పారు, అయితే అప్పటి నుంచి స్నేహం మొదలైందని, ఆ తర్వాత శివశంకర్ మాస్టర్ చాలా  సినిమాలకు కలిసి పనిచేశామని తెలిపారు. శివశంకర్ మాస్టర్ మరణం నృత్య రంగానికి, చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చిరంజీవి తెలిపారు. చివరిగా శివశంకర్ మాస్టర్ ని 'ఆచార్య' సెట్స్ లో కలుసుకున్నాము అని చిరంజీవి తెలిపారు. ఆయన కుటుంబానికి ఈ కష్టకాలంలో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.
Recent Post