‘పుష్ప’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 29, 2021, 12:02 PM

అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈసినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 6న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు.  ఈ సినిమా రెండు భాగాలుగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, సునీల్ మరియు యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడని సమాచారం. అయితే సినిమాలో సునీల్ మెయిన్ విలన్ అని కొందరు అంటున్నారు. ఈ సినిమాలో సునీల్ మంగళం శ్రీను, అనసూయ దాక్షాయణి కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
Recent Post