యాక్షన్ .. ఎమోషన్ తో ఇంట్రస్టింగ్ గా 'లక్ష్య' ట్రైలర్!:

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 01, 2021, 06:31 PM

విల్లు విద్య నేపథ్యంలో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరో గా  కేతిక శర్మ కథానాయికగా నటించిన మూవీ 'లక్ష్య'. తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ యాక్షన్ .. ఎమోషన్ తో చాల  ఇంట్రస్టింగ్ గా ఉంది. సృజనమణి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. "పడి లేచినవాడితో పందెం చాలా ప్రమాదకరం" అనే డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. "వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు .. నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావ్ .. ఇద్దరూ ఒకటేగా" . ఇంకా "నేను వందమందికి నచ్చక్కరలేదు సార్ .. కానీ నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దనుకుంటే ఇక నేను గెలిచేది దేనికి సార్" వంటి డైలాగ్స్ బాగున్నాయి. సినిమాలో, జగపతిబాబు .. సచిన్ కేడ్కర్ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Recent Post