కావాల్సినంత కామెడీ తో 'స్కైలాబ్' నుంచి టీజర్!

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 01, 2021, 06:41 PM

'స్కైలాబ్' నుంచి మంచి కామెడీ తో 'స్కైలాబ్' నుంచి టీజర్ విడుదల అయ్యింది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం లో నిత్యామీనన్, సత్యదేవ్ ప్రధాన పాత్రలతో పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన సినిమా 'స్కైలాబ్'. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే నిర్మాణ భాగస్వామిగా నిత్యా మీనన్ వ్యవహరించింది. ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. చాలా కాలం క్రితం స్కైలాబ్ పడుతుందనీ ..  ఎవరూ బ్రతకరనే ప్రచారం గ్రామాల్లో బలంగా జరిగింది. దాంతో ఎవరికి ఇష్టమైనవి వారు చేసుకుని తిన్నారు. ఏ క్షణంలో ఎక్కడ స్కైలాబ్ పడుతుందోనని ఆకాశం వైపు చూస్తూ భయంతో బ్రతికారు. ఆ సంఘటననే ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది.
టీవీలకు .. మొబైల్  ఫోన్లకు  దూరంగా గడిచిన ఆ కాలానికి సంబంధించిన వాతావరణాన్ని బాగానే ప్రతిబింబించారు. సినిమాలో కావలసినంత కామెడీ ఉంటుందనే విషయం టీజర్ ను బట్టి తెలుస్తోంది. తులసి .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన  పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నారు.
Recent Post