శ్యామ్ సింగరాయ్ నుండి ప్రోమో!... నాని పాత్ర డెప్త్ వేరే లెవల్ లో ఉందిగా!

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 01, 2021, 06:54 PM

నాని హీరోగా  సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్న మూవీ శ్యామ్ సింగరాయ్. ఈ మూవీ నుండి లేటెస్టుగా ప్రోమో గ రిలీజ్ చేసారు ఆ ప్రోమోలో నాని పాత్ర డెప్త్ వేరే లెవల్ లో ఉన్నట్లు కనిపిస్తుంది, పిరియాడికల్ స్టోరీ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. తాజా ప్రోమో నాని ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రోమో ఆద్యంతం సింగరాయ్ ఎలివేషన్ పీక్స్ లో వర్కవుటైంది. నాని లుక్ గెటప్ ఆహార్యం ప్రతిదీ మారిపోయింది. ఒక కొత్త నానీని చూస్తున్నట్టే ఉంది. పక్క పాపిడి మెలి తిప్పిన రింగు మీసం మెలి వేయడం వగైరా వగైరా అతడి ని ప్రత్యేకంగా ఆవిష్కరిస్తున్నాయి. దారపు మగ్గం తిప్పుతున్న నాని ని చూస్తుంటే ఆ పాత్రలోని డెప్త్ వేరే లెవల్లో ఉంటుందని అర్థమవుతోంది. మీసం మెలేస్తున్నాడు.. కనుబొమలు ఎగరేస్తున్నాడు.. మగువలకు ఆటోగ్రాప్ ఇస్తున్నాడు. కొంచెం పెద్ద మనిషి తరహాగా కనిపిస్తున్నాడు.. అతడిని చూస్తే జనం వంగి వంగి సలాం కొడుతున్నారు. ఇంతకీ ఎవరీయన? అంటే.. పేరు శ్యామ్ సింగరాయ్.ఈ మూవీ 24 డిసెంబర్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.
Recent Post