అమెరికా లోని ‘క్యాచ్’ లో ర్యాప్-అప్ పార్టీ డిన్నర్‌లో 'లైగర్' టీం సందడి

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 01, 2021, 08:10 PM

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లైగర్‌’. ఇందులో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ లాస్‌ ఏంజిల్స్‌లో జరుగుతోంది. విజయ్‌ దేవరకొండ, మైక్‌ టైసన్‌లపై సన్నివేశాల చిత్రీకరణకు లాస్‌ ఏంజిల్స్‌కి వెళ్లింది. అక్కడ డిన్నర్‌లో 'లైగర్' టీం సందడి చేసింది.
పాన్-ఇండియా చిత్రం  'లైగర్' యొక్క చివరి షెడ్యూల్ కోసం 'లైగర్' యొక్క మొత్తం టీం యునైటెడ్ స్టేట్స్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. 'లైగర్' యొక్క మొత్తం టీం అమెరికా లోని ‘క్యాచ్’ లో ర్యాప్-అప్ పార్టీ డిన్నర్‌లో సందడి చేసింది. ఎంతో ఆసక్తిగా ఉన్న ఈ ఫొటోస్ ని నిర్మాతలలో ఒకరైన ఛార్మి కౌర్, ట్విట్టర్‌లో ర్యాప్-అప్ పార్టీ నుండి ఫొటోస్ ని షేర్ చేసారు. ఈ డిన్నర్ పార్టీ లో  విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ మరియు అనన్య పాండేతో సహా అందరూ చాలా సరదాగా గడిపారు.
ఛార్మీ  ఈ పార్టీ వేడుకల నుండి ఫొటోస్ ని  షేర్ చేస్తూ  ఇలా వ్రాశారు, “అత్యుత్తమ ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన ‘క్యాచ్’లో ర్యాప్-అప్ పార్టీ కోసం మేము అమేజింగ్ డిన్నర్ కి వచ్చాము బెస్ట్ షెడ్యూల్ లో రుచికరమైన ఆహారం తో  # 'లైగర్' టీం” అని రాసారు. 'క్యాచ్' అనేది లాస్ ఏంజిల్స్‌లోని వెస్ట్ హాలీవుడ్‌లో సెలబ్రిటీలు ఎక్కువుగా వచ్చే రెస్టా రెంట్లలో ఒకటి.  ఇక్కడ అన్ని రకాల సీఫుడ్-ఫోకస్డ్ ఫుడ్ మరియు కాక్‌టెయిల్‌లకు ఈ 'క్యాచ్' ప్రసిద్ధి.
Recent Post