ఎట్టకేలకు ఫిక్స్ అయిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్.. ఎప్పుడంటే?

  Written by : Suryaa Desk Updated: Sat, Dec 04, 2021, 08:30 PM

ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ఫైనల్ ' ట్రైలర్ రిలీజ్ డేట్ ని  ప్రకటించారు.ఇక ఈ సినిమా షూటింగ్ తాజాగా  పూర్తి అయింది.జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక  ట్రైలర్ విషయానికి వస్తే ఈ నెల 9న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు కాగా, అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం గ్లింప్స్ కూడా విడుదల కాగా, సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించింది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అనేక చిత్రాల విడుదలపై అస్పష్టత నెలకొంది. మరి ఎలా ఉంటుందో అప్పటి పరిస్థితి చూడాలి మరి.
Recent Post