కన్నడ సీని పరిశ్రమలో విషాదం.. మరోనటుడి మృతి

  Written by : Suryaa Desk Updated: Sat, Dec 04, 2021, 10:08 PM

కన్నడ సీని పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది మరోనటుడి మృతి చెందాడు. పునీత్ రాజ్ కుమార్ మృతి తో శోక సంద్రంలో మునిగి పోయిన కన్నడ సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో తాజాగా మరోనటుడు మరణించిన వార్తను కన్నడ సీని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 83 ఏళ్ల శివరాం మంగళవారం రాత్రి తన నివాసంలో పూజా కార్యక్రమాలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకులారు. శివరాంను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆయన బ్రెయిన్‌ హెమరేజ్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. వయస్సు రీత్యా ఆయనకు సర్జరీ చేయలేమని వైద్యులు పేర్కొన్నారు. వారం కిందట శివరాంకు కారు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి.  కేఆర్‌ సీతారామ శాస్త్రీ, పుట్టన్న కనగల్‌, సింగీతం శ్రీనివాసరావు వంటి అగ్ర దర్శకుల వద్ద శివరాం పనిచేశారు. కన్నడలో పలు సినిమాలు నిర్మించిన శివరాం రజనీకాంత్‌తో తమిళంలో ధర్మదురై అనే సినిమాను నిర్మించారు.
Recent Post