విడాకుల పై సమంత స్పందన

  Written by : Suryaa Desk Updated: Tue, Dec 07, 2021, 04:37 PM

నాగచైతన్యతో విడాకుల తర్వాత తొలిసారిగా సమంత స్పందించారు. పలు సార్లు సోషల్ మీడియాలో వివిధ పోస్టులు చేసినా విడాకుల పై ఆమె స్పందించలేదు. తాజాగా ఓ ఇంగ్లీషు ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక విషయాలు తెలిపారు. సమంత ఏమన్నారంటే.. “నేను చాలా బలహీనమైన వ్యక్తిని అని ఎప్పుడు అనుకుంటాను. చిన్న దానికే ఎమోషనల్ అవుతుంటాను. నేను అందరు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు. విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది నేను ఎంత స్ట్రాంగో. ఇంత బలంగా ఉన్నానని తెలిసి నాకే ఆశ్చర్యమైతుంది. నేను ఎప్పుడు కూడా ఇంత గట్టిగా ఉంటానని అనుకోలేదు.” అని సమంత స్పందించారు.
Recent Post