మెగాస్టార్ మూవీలో రష్మీ ఐటెం సాంగ్.. రెమ్యునరేషన్‌ మరీ అంతా..?

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 08, 2021, 08:53 PM

మెగాస్టార్ మూవీలో రష్మీ ఐటెం సాంగ్..  రెమ్యునరేషన్‌ మరీ అంతా..?
మెగాస్టార్ చిరంజీవి, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'భోళ శంకర్‌'. ఈ మూవీలో రష్మీ ఐటెం సాంగ్.. స్పెషల్ గా ఉంటుందని టాక్.. అయితే రష్మీ మాత్రం రెమ్యునరేషన్‌ లో తగ్గేదే లేదు అంటుందని గుస గుస లు వినపడుతున్నాయి.  బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో తో దూసుకుపోతూ టాప్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది రష్మీ గౌతమ్ మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోన్న రష్మీ తాజాగా అనసూయను బాటలో వెళ్తుంది. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసే ఆఫర్‌ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం 'భోళా శంకర్‌'.

ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. చిరు సినిమాలంటే పాటలకి ఉండే ప్రత్యేకత గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అందులో మెగాస్టార్‌ ఆ పాటలకు కాలు కదిపితే ఆ రచ్చ మామూలుగా ఉండదనే విషయం ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అంత క్రేజ్‌ ఉన్న చిరు సినిమాలో రష్మీ స్సెషల్‌ సాంగ్‌ చేయడమంటే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్టే. ఈ క్రమంలో ఈ పాటకు రష్మీ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఐటెం సాంగ్ చేయడానికి రష్మీ భారీగానే పారితోషికం అందుకుంటోందని ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఐటమ్‌ సాంగ్‌ చేయడానికి భారీగానే డిమాండ్ చేసిందని వినికిడి. దీంతో ఈ ఒక్క పాట కోసం ఆమెకు దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అది విని అంతా అవాక్కవుతున్నారు. ఒక్క పాటకే అంత పారితోషికమా? ఇది రష్మీకి గోల్డెన్‌ ఆఫర్‌ లాంటిది అంటున్నారు. అంతేకాదు చిరుతో స్టెప్పులేసి థియేటర్లలో రష్మీ గోల పెట్టించబోతోందని చెప్పుకుంటున్నారు.దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారట. ఇక మరో ఆసక్తికర విషయమేంటంటే ఈ సాంగ్ కోసం రష్మీని రిఫర్ చేసింది శేఖర్ మాస్టార్‌ అట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.
Recent Post