మాస్ పార్టీకి రెడీనా అంటూ.. ‘పుష్ప’ నుండి సమంత ఐటెం సాంగ్

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 08, 2021, 09:08 PM

సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.తాజాగా ఈ మూవీలో సమంత ఐటెం సాంగ్ చేస్తున్న విష్యం తెలిసిందే.. తాజాగా ఈ సాంగ్ నుండి ఒక కొత్త అప్డేట్ ని మూవీ టీమ్ విడుదల చేసింది. సమంత ఐటెం సాంగ్ లో  ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 10 న రిలీజ్ చేస్టున్నట్లు మేకర్స్ తెలిపారు. “మాస్ పార్టీకి సిద్ధం కండి .. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్” అంటూ సామ్ న్యూ పోస్టర్ తో అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో సామ్ బ్లూ కలర్ తళుక్కు టాప్ లో సెక్సీ లుక్ తో అదరగొట్టేసింది.. ప్రొఫెషనల్ ఐటెం భామలా కనిపించడంతో అమ్మడి ఎక్స్ ప్రెషన్స్, బన్నీ ఊర మాస్ స్టెప్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంటాయని తెలుస్తోంది. మరి సామ్ మొదటి ఐటెం సాంగ్ ఎంతటి రచ్చ క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
Recent Post