మరోసారి ఈడీ విచారణకు హాజరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్

  Written by : Suryaa Desk Updated: Wed, Dec 08, 2021, 10:22 PM

సుకేష్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం మళ్లీ విచారణకు పిలిచింది. ఈ కేసులో సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఫెర్నాండెజ్ బుధవారం ఈడీ ఎదుట హాజరయ్యారు.ఆమె ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ  కార్యాలయం ఉన్న సెంట్రల్ ఢిల్లీలోని MTNL భవనానికి చేరుకున్నారు. ఆమె వాంగ్మూలం నమోదు చేసిన గదిలో ఓ మహిళా అధికారి, మరో ఐదుగురు ఉన్నారు. ఛార్జ్ షీట్ విషయంలో తదుపరి విచారణ డిసెంబర్ 13న జరగనుంది.
Recent Post