రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరించారంటూ అల్లూరి యువజన సంఘం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అల్లూరిని బ్రిటీష్ పోలీస్ గా చూపడం దారుణమని, అల్లూరి, కుమ్రం భీంలు కలిసినట్లు చరిత్రలో లేదని పేర్కొన్నారు. అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ తీసిన సీన్స్ తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు.